Site icon NTV Telugu

Jampanna River: ఉదృతంగా జంపన్న వాగు.. వరదలో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్లు

Jampanna Vagu Rain Flodd

Jampanna Vagu Rain Flodd

Jampanna River: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల గ్రామాల్లో వరదలో చిక్కుకున్న 100 మందినిహెలికాప్టర్ ద్వారా మరికొద్ది సేపట్లో వరద ప్రాంతం నుండి బయటకు తీసుకురానున్నారు. జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించడంతో నిన్న సహాయక చర్యలు చేపట్టినప్పటికి NDRF బృందాలు వరద ఉదృతికి ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం వరద తగ్గడంతో సహాయక చర్యలు మళ్లీ చేపట్టారు. వరదలో కొట్టుకుపోయిన 8 మందిలో 7 మృత దేహాలు లభ్యం అయ్యాయి. ఇంకొకరి కోసం NDRF బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

హెలికాప్టర్ రాగానే గర్భిణీ స్త్రీలను, వృద్ధులను వరద ప్రాంతం నుండి బయటకు తీసుకురానున్నట్లు ములుగు జిల్లా SP గాస్ ఆలం తెలిపారు. కొండాయి, మల్యాల గ్రామ ప్రజలు వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మృతుల బంధువులు రోదిస్తున్నారు. నిన్న వరదలో కొట్టుకుపోయిన సమయంలో ప్రభుత్వం హెలికాప్టర్ పంపించివుంటే 8 మంది ప్రాణాలను కాపాడుకునే వాళ్ళం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘటనాస్థలికి చేరుకున్నారు. హెలికాప్టర్లు రంగంలోకి దిగి మిగతా వారిని రక్షించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నదిలో కొట్టుకుపోయిన యాచకుల్లో ఒకరు కరెంట్ వైర్లకు వేలాడుతూ కనిపించారు. మృతుడి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే వరద ముప్పుతో ములుగు జిల్లాలోని జంపన్న నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నది ఉధృతంగా ప్రవహించడంతో సమీపంలోని కొండాయి, మాల్యా గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పడవలు, డ్రోన్ కెమెరాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Delhi: ఇద్దరు కలిసి అక్కడకు వెళ్లేవారు.. ఇంతలోనే హఠాత్ పరిణామాలు

Exit mobile version