Formula E Cancel: దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఇ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… హుస్సేన్ సాగర్ తీరం వెంబడి రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. మన దేశంలో తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా – రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరంలో క్యూ కట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ ఫార్ములా ఇ రేసింగ్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని అందరూ ఆశపడ్డారు. కానీ తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన రేసింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఇ రేస్‌ను రద్దు చేసినట్లు ఎఫ్‌ఐఏ ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో రేసును రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌ఐఏ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదనే నిర్ణయాన్ని ఉటంకిస్తూ రేస్ నిర్వహించబోమని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
Read also: Channel Rates : మీరు సీరియల్ ప్రియులా.. అయితే ఇక భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..
గత ప్రభుత్వ హయాంలో, ఫార్ములా ఈ సంస్థ 30 అక్టోబర్ 2023న రేసింగ్‌కు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. భారీ రేసింగ్‌కు హైదరాబాద్ నగరం కూడా ఒక హోస్ట్ సిటీగా ఉంది. అయితే, ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన హైదరాబాద్ ఈ-ప్రిక్స్‌ను నిర్వహించడం కష్టసాధ్యమేనని తెలుస్తోంది. తెలంగాణ కొత్త ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. ఈ రేసు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదని ఫార్ములా తెలుస్తోంది. ఫార్ములా ఈ నెల ప్రారంభంలో తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంతో ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం సమావేశమైంది. అప్పటి నుంచి ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. ఈ భారీ ఈవెంట్‌కు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ఈ రేసింగ్ ప్రతినిధులు ఈవెంట్ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది రేసు టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్ లతో సహా ఇతర ప్రముఖ ప్రపంచ నగరాల్లో నిర్వహించబడుతుంది.
Praja Palana: అలర్ట్.. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు నేడే చివరిరోజు..