Site icon NTV Telugu

బీఎస్పీలో చేరనున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్.. ముహూర్తం ఖరారు

RS Praveen Kumar

RS Praveen Kumar

వీఆర్‌ఎస్‌ తీసుకున్న సీనియర్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీ ఖారారు అయిపోయింది.. బహుజన్‌ సమాజ్‌పార్టీలో ప్రవీణ్‌కుమార్‌ చేరుతున్నారంటూ.. ఆ పార్టీ అధినేత్రి మాయావతియే స్వయంగా ప్రకటించారు.. ఇక, ఈ మాజీ ఐపీఎస్‌… బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది… ఆగస్టు 8వ తేదీన నల్గొండ వేదికగా.. బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. నల్గొండలోని ఎన్‌జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో.. పార్టీలో చేరనున్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. ఇక, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వేరోస్‌, మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారని తెలుస్తోంది.. మరోవైపు.. వీఆర్ఎస్‌ తీసుకున్న తర్వాత స్వేరోస్‌తో పాటు ఇతర ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు ప్రవీణ్‌కుమార్.. కొన్ని జిల్లాల్లో పర్యటనలు కూడా చేశారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఓవైపు జరిగినా.. అభిమానుల అభిప్రాయాల మేరకు ఆయన బీఎస్పీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Exit mobile version