NTV Telugu Site icon

TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..

Mahender Reddy

Mahender Reddy

TSPSC Chairman: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ సౌందరరాజన్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో ఆయన టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి ముగ్గురి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ఎట్టకేలకు తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవికి మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకోగా.. 321 మంది సభ్యుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒక్కరే కావడంతో ఆయన ఎంపికకే ప్రభుత్వం మొగ్గు చూపించింది. TSPSC చైర్మన్ నియామకానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ ఆమోదించారు.

Read also: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఆటో ఢీ.. 12 మంది మృతి

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్. ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవిని తీసుకునేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అంగీకరించలేదని సమాచారం. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆర్‌ఎస్‌ తెలిపారు. ప్రవీణ్ కుమార్ చెప్పినట్లు సమాచారం. దీంతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. TSPSC సభ్యులుగా TSCSC సభ్యులుగా పాల్వాయి రజినీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, Y. రామ్మోహన్ రావు మరియు రిటైర్డ్ IAS అధికారి అనితా రామచంద్రన్‌లను ప్రభుత్వం నియమించింది.
Jagadish Shettar: కర్ణాటక కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి జగదీష్ షెట్టార్..