Site icon NTV Telugu

టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం !

టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమ‌ని.. బీజేపి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నేతలు విర్రవీగి పోతున్నారని ప్ర‌భాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల్లో రుజువైందని ఆగ్ర‌హించారు. వాళ్ళ పార్టీ ఓట్లను కూడబెట్టుకోవడంలో విజయవంతం అయినట్లు ఉంది వారి వ్యవహారం ఉంద‌ని మండిప‌డ్డారు.

నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కేసీఆర్ జిల్లా ల పర్యటన చేస్తున్నార‌ని.. నేనే పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకునేందుకే పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏ హామీలు అమలు చేసావో ప్రజలకు సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి వెళ్ళాలని.. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చావో చెప్పి పర్యటన లకు వెళ్ళాలని చుర‌క‌లు అంటించారు. ఆర్టీసీ.. కరెంట్ చార్జీలు పెంచనని ఇచ్చిన హామీ నెరవేరుస్తా అని చెప్పి జిల్లా ల పర్యటన కు వెళ్ళాలని..డిమాండ్ చేశారు.

Exit mobile version