Food Poisoning Rampant In Adilabad Gurukul Govt Hostels: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిన్న రాత్రి భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ బాగుండట్లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. వాంతులతో విద్యార్థులు కడుపునొప్పి ఎక్కువగా వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు.
అయితే ఈనెల 6న తేదీన వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే వారిలో 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా వుండంటతో.. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించిన విషయం తెలిసిందే. భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారు. ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. యాజమాన్యం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ మధ్యకాలంలో తరుచూ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి గురుకుల్లో జరిగే పుడ్ పాయిజన్ గురించి కాస్త ఆలోచించాలని. ఇలాంటి వారిపై కఠిచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
