నాణ్యత లేని భోజనం, అపరిశుభ్రమైన బోరు నీళ్లు విద్యార్థుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.ఇటు స్కూల్స్ ,అటు హాస్టళ్లు, చివరికి బాసర ట్రిపుల్ ఐటీలో పెట్టే పుఢ్ పైన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా పాయిజన్ కావడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాంతులు, విరేచనాలతో తరచూ ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థులపై ఓ రిపోర్ట్.
మొన్న రూరల్ కేజీబీవీ తర్వాత ఘోట్కూరి ప్రాథమిక పాఠశాల అంతకంటే ముందు బాసర ట్రిపుల్ ఐటీ..తాజాగా భీంపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వరుసగా విద్యార్థులు తిన్న తిండితో ఆసుపత్రుల పాలవుతున్నారు…ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతుండగా, విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. క్వాలిటీ భోజనం అందించకపోవడం, పైగా శుద్ద జలం లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
‘
ఆదిలాబాద్ జిల్లాలో పలు స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…ఈనెల 9 న ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కస్తూర్భా విద్యాలయం, ఆదిలాబాద్ విద్యానగర్ లో నిర్వహిస్తున్నారు. సరైనసౌకర్యాలు లేకపోవడం, నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో 42 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు…10న మరో 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారు..అదే రోజు తాంసి మండలం ఘోట్కూరి ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు కావడంతో రిమ్స్ కు తరలించారు……11న రోజు విచారణ చేపట్టి ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు.
ఈ ఘటన మరుకముందే తాజాగా భీంపూర్ మండలానికి చెందిన కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది..ఇందులో 70 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు..విషయం తెసిన వెంటనే 35 మందిని రిమ్స్ కు తరలించగా, మిగతా విద్యార్థినిలను స్కూల్ లోనే వైద్యం అందిస్తున్నారు.కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 170 మంది వరకు విద్యార్థినిలు అస్వస్థతకు గురైన కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. విద్యార్థి సంఘాలు మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడి నాణ్యమైన భోజనం అందించకపోవడం, అలాగే ఆర్ ఓ ప్లాంట్ వాటర్ ఇవ్వకపోవడమే కారణమంటూ ఆరోపిస్తున్నారు.
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు..రిమ్స్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు
అయితే కాంట్రాక్టర్లు,కేజీబీవీలో ఎస్ ఓలు కుమ్ముక్కై నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఫుడ్ గురించి ప్రశ్నిస్తే..ఎస్ ఓలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
