నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. అయితే జనరల్ ఎవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీవీ తో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత మాట్లాడుతూ.. మా అకాడమీలో మహిహ పైలెట్ కోచింగ్ తీసుకుంటోందని ఆమె తెలిపారు. గత ఆరు నెలలుగా అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటోందని, దాదాపు ఎనభై ఐదు గంటలపాటు విమానం నడిపిన అనుభవం మహిమకు ఉందని ఆమె వెల్లడించారు.
ఎయిర్ క్రాఫ్ట్ పూర్తి కండిషన్ లోనే ఉందని, మహిమ మంచి పైలెట్ అని ఆమె తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది మాకు కూడా తెలియడం లేదని, ఈ ప్రమాదంపై డీజీసీఐ, పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటి తర్వాత మహిమ ఎయిర్ క్రాఫ్ట్‌తో మాకు కాంటాక్ట్ తెగిపోయాయని, ఇప్పటివరకు అకాడమీ నుండి జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని ఆమె పేర్కొన్నారు.