Narayana Pet Road Accident: నారాయణ పేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కోట్టుకున్న ఈ ఘటన అయిదుగురు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జక్లేర్ వద్ద 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకువచ్చారు. మరో నలుగురు క్షతగాత్రులను మక్తల్ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
