Firing in Gold Shop: నాగోల్ బంగారం చోరీ ఘటన భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నాగోల్ స్నేహపురి కాలనీలో వున్న బంగారం షాప్ లో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చి షాప్ లోపలికి వెళ్లి షట్టర్ ని మూసివేసి బంగారం దోచుకున్నారు. తమతో తెచ్చుకున్న తుపాకులతో షాప్ యజమాని కళ్యాణ్ సింగ్‌తో పాటు వర్కర్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ లభ్యమైన తుపాకీ బుల్లెట్ షేల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈఘటన పై వైద్యులు ఎన్టీవీతో మాట్లాడారు. బంగారం షాప్ దుండగుల దాడిలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని సుప్రజ హాస్పిటల్ డాక్టర్ చెప్పారు. వైద్య బృందం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు. సర్జరీ చేస్తున్నామని, కళ్యాణ్ పేషంట్ కు, సుఖేదేవ్ కు లంగ్స్ కు స్పైనల్ కు మధ్యలో ఉందన్నారు. సుఖేదేవ్ పరిస్థితి 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమన్నారు. బుల్లెట్ బయటికి తీస్తే గానీ సుఖేదేవ్ పరిస్థితి చెప్పలేమని క్లారిటీ ఇచ్చారు. ఆప్రరేషన్ జరిగిన తర్వాత కూడా సుఖేదేవ్ పరిస్థితి విషమంగా ఉండే అవకాశం ఉందని, ఇప్పటికీ ఒక్కరి బాడీ లో రెండు బుల్లెట్స్ గుర్తించామన్నా తెలిపారు.
Read also: Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. ఈ సారి ఎలాగంటే..
నాగోల్ మహాదేవ్ జువెలర్స్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. 15 బృందాలతో దోపిడీ దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు అన్నారు. బంగారు షాప్ వద్ద ముందుగా రెక్కి నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. రెండు బైకుల్లో నలుగురు దోపిడీ దొంగలు వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ లభ్యమైందని అన్నారు. బంగారు షాపు షెటర్ మూసివేసి బంగారు ఆభరణాలు ఇవ్వాలంటూ యజమాని కళ్యాణ్, బంగారం వ్యాపారి సుఖ్ దేవ్ ను దుండగులు బెదిరించారని అన్నారు. బంగారాన్ని దోచుకుంటుండగా కళ్యాణ్, సుఖ్ దేవ్ అడ్డుకోవడంతో.. కంట్రీమేడ్ వెపన్ తో దోపిడి దొంగలు కాల్పులకు దిగబడ్డారు. కాల్పుల శబ్దం విని ఘటనా స్థలానికి స్థానికులు రావడంతో.. అప్పటికే బంగారంతో పాటు నగదును, రెండు బైకుల్లో ఎత్తుకెళ్లారు. సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు. రాజాస్థాన్ ,హర్యానా, యూపీ గ్యాంగ్ కు చెందిన సభ్యులుగా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. రెండు బులెట్ లు స్వాదీనం, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.