Fire Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద అర్జున్ చౌహన్ బైక్ పాయింట్ లో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. బైక్ మెకానిక్ షాప్ లో మంటలు రావడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.
Read also: V.K. Pandian: ఈ ‘సూపర్’ పాండియన్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?
మంటలు వ్యాపించడంతో పక్కనే వున్న వారికి అక్కడి నుంచి తరలించారు. మంటలు షాప్ మొత్తం వ్యాపించడంతో 18 బైకులు వరకు దగ్దమయ్యాయని షాప్ యజమాని తెలిపారు. భారీగా నష్టం జరిగిందని వాపోయాడు. మంటలు ఎలా వ్యాపించాయో తెలియదని అన్నాడు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, షాప్ లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?