NTV Telugu Site icon

Fire Accident: కామారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం.. మాల్ లో అదుపులోకి రాని మంటలు

Kamareddy

Kamareddy

fire accident in kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో మంటలు క్రమంగా చెలరేగిన షాపింగ్ మాల్‌లోని నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా షాక్ కు గురయ్యారు. మాల్ లో మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళనకు గురయ్యారు. మంటల్లో మాల్‌లోని సామగ్రి దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మాల్ లో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. జేసీబీ సహాయంతో షాపింగ్ మాల్ షట్టర్లు తొలగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 6ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 7 గంటల గడుస్తున్న ఇంకా మంటలు అదులోకి రాలేదు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read also: Parliament Attack : నాలుగు రాష్ట్రాల దుర్మార్గులు.. పక్కా స్క్రిప్ట్ తోనే పార్లమెంట్ పై దాడి

మిగిలిన రెండు అంతస్తుల్లో మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 6 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం, మొదటి, రెండోవ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట తో అగ్ని ప్రమాదం జరిగిందా? ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు. షాపింగ్ మాల్ లో.. నూతన వస్త్రాలు, ఫర్నిచర్ కాలిబుడి దైంది. అయితే షాపింగ్ మాల్ యజమానికి సమాచారం ఇచ్చారు. అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.