Site icon NTV Telugu

Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

Secunderabad Fire Accident

Secunderabad Fire Accident

Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఏడుమంది సజీవ దహనమయ్యారు. రూబీ హోటల్‌ సెల్లార్‌ లో ఎలక్ర్టిక్‌ స్కూటర్ల షోరూం నిర్వహిస్తున్నారు. సెల్లార్‌ పై అంతస్తులో రూబి హోటల్‌ ను వుంది. అందులో వసతి పొందేందుకు పర్యాటకులు వస్తుంటారు. నిన్న సోమవారం రోజూలాగానే లాడ్జిలో వుండేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. నిన్న రాత్రి అందరూ ప్రసాంతంగా గాఢనిద్రలో నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. ఏం జరుగుతుంతో పరిశీలించగా.. రూబీ హోటల్‌ కింద ఫ్లోర్‌ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కొందరు ఫైరింజన్లు సమాచారం అందించడంతో.. హుటాహుటిన ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలార్పే పనిలో పడ్డారు. హోటల్‌ లోని వారిని కిందకి దించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, స్థానికులు. రూబీ హోటల్‌ లో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. 13 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు.

బిల్డింగ్ యజమాని రంజిత్ బగ్గ గా గుర్తించారు. రూబీ హోటల్స్, రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పేరుతో వ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోని ఎలక్ర్టిక్‌ బైక్‌ షోరూంలో మంటలు చెలరేగడంతో మంటలు చెలరేగాయి. సెల్లార్‌ లోబ్యాటరీల చార్జింగ్ తోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ-స్కూటర్ల బ్యాటరీలు వరుస పెట్టి పేలిడంతో.. దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో అలర్ట్‌ అయిన రూబీలో వసతి పొందుతున్న వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హోటల్‌ లోపలికి, బయటకెళ్లేందుకు ఒకేదారి వుండటంతో బయటకు వచ్చేందకు ఇబ్బంది ఎదురైంది. కొందరిని ఫోర్‌ కిటకీల నుంచి కిందికి దూకే ప్రయత్నించి వారి ప్రాణాలు కాపాడుకున్నారు. మరి కొందరిని ఫైర్‌ సిబ్బంది వారి ప్రాణాలకు తెగించి పలువురిని కాపాడారు. మరి కొందరు అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బిల్డింగ్ యజమాని రంజిత్ బగ్గ నిబంధనలకు విరుద్ధంగా హోటల్‌ సెల్లార్‌ లో ఎలక్ర్టికల్‌ షోరూం నిర్వహిస్తున్నాట్లు అధికారులు తెలిపారు. గాయ పడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు సీతారాం చెన్నై, హరీష్ కుమార్ విజయవాడ, వీరేంధర్ కుమార్ ఢిల్లీ గా గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను సమచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. లాడ్జిలో 23 గదులున్నాయి. ప్రమాద సమయంలో హోటల్లో 25 మంది పర్యాటకులు ఉన్నట్లుగా గుర్తించారు. ఊపిరాడక కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో, కారిడార్‌లో పడిపోయారు. దట్టంగా పొగచూరడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు. మంటలు అంటుకుని నలుగురు, ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందికి దూకి కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. మొదటిగా రూబీ హోట్లో సెల్లార్లో మంటలు చెలరేగాయి.. సెల్లార్‌ లో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ బైక్ లు పార్క్ చేసి ఉన్నట్టుగా గుర్తించారు. ఎలక్ట్రికల్ బైక్ లో షార్ట్ కట్ వల్ల అగ్ని ప్రమాదం.. దీంతో ఒక్కసారిగా సెల్లర్లో పేలుడుకు గురైన బ్యాటరీలు.. బ్యాటరీల నుంచి వచ్చిన దట్టమైన పొగలు మొత్తంగా బిల్డింగ్ వ్యాపించినట్లుగా గుర్తించారు. నాలుగు అంతస్తుల భవనాన్ని పూర్తిగా దట్టమైన పగలు ఆక్రమించింది. దీంతో శ్వాస ఆడక కొందరు మృత్వువాత పడ్డారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version