లాన్ పార్కింగ్ చేసుకున్న కార్లు అగ్నికి ఆహుతైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్కింగ్‌లో ఒక్కసారిగా ఓ కారులో మంటలు చెలరేగి నాలుగు కార్లుకు మంటలు వ్యాపించాయి. అయితే దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను అదుపు చేసే లోపే 4 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపు చేశారు. కారు ఇంజన్ లో మంటలు చేలరేగడం వల్ల పక్కనే కార్లు పార్కింగ్ ఉండడం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసుల అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fire : జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం..
