Site icon NTV Telugu

Digital fingerprints: నేరస్తులపై నిఘా.. డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ తో చెక్‌..

Digital Fingerprints

Digital Fingerprints

డిజటల్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ దొంగల పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని, దీంతో ఆధునిక బాట పడుతున్నారు పోలీసులు. సీఐడీ లోని ఫ్రింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో తెలుగు రాష్ట్రాల్లో తరచుగా నేరాలకు పాల్పడే సుమారు 7.82 లక్షల మంది వేలిముద్రలు సేకరించింది. అయితే.. గతంలో నేరం చేసినప్పుడు నిందితులను పోలీసులు సిరాతో వేలిముద్రలు సేకరించి రికార్డుల్లో భద్రపరిచే వారు.. కాగా ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. నేర పరిసోధనకు డిజిటల్‌ వేలిముద్రలను లైవ్‌ స్కానర్‌, మొబైల్‌ హ్యాండ్‌ చెక్‌ డివైజ్‌ పరికరాలను అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని వికారబాద్‌ జిల్లాలోని ముఖ్య పోలీస్‌ ఠాణాలకు ఈ పరికరాలు అందాయి. దీంతో నిందులను సులువుగా గుర్తించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఆధునిక పరిజ్ఞానాన్ని రష్యాలో అమలు చేస్తున్నారు. దీని ద్వారా సేకరించిన పాపిలాన్‌ డీఎస్‌ -45 అనే సాప్ట్‌ వేర్‌ ను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక ఏడాది కిందట హైదరాబాద్‌ పోలీసులతో పాటు దశల వారీగా అన్ని జిల్లాల పోలీసులకు ఈ పరికరాల వినియోగంపై అవగాన కల్పించి అందజేశారు. ఈనేపథ్యంలో.. 2007 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడిన వారి నేరాల వివరాలు, ఫోటోలను, వేలిముద్రలను ఈ సాప్ట్‌వేర్‌ లో పొందుపర్చారు. అయితే.. ఏడాది కాలం ఈవిధానం ద్వారా 60మందికి పైగా నిందితులను గుర్తించనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే వీటిపై వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక విధానం మంచి ఫలితాన్ని ఇస్తోందని , ఎక్కడ నేరం జరిగినా అక్కడ సేకరించిన వేలిముద్రలను పాపిలాన్‌ సాప్ట్‌ వేర్‌ కు అనుసంధానం చేస్తున్నారని వివరించారు. లక్షలాది వేలిముద్రల్లో నిందితుల వేలిముద్రలను సరిపోల్చుకోవడం నిముషాల వ్యవధిలోనే పూర్తవుతోందని, ఈ విధానాన్ని అమలుచేసే విధంగా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

Oil tanker capsized: పల్నాడులో ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. క్యాన్లతో ఎగబడిన జనం..

Exit mobile version