Site icon NTV Telugu

Nirmala Sitharaman: తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబు కూడా అప్పు కట్టాల్సిన పరిస్థితి

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Finance Minister Nirmala Sitharaman Comments On CM KCR: నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 38,500 కోట్లతో ప్రారంభమై అదనంగా లక్షా 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి అడగటానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుడే పుట్టిన భాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను తెలంగాణ ప్రజల కోసం నమస్కరిస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రతీ ఒక్కటీ అమల్లోకి రావాలని అని అన్నారు. అప్పులపై ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి ఉందని అన్నారు. నేనే కేంద్ర మంత్రి అన్నట్లుగా సీఎం కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని.. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 20 వేల కోట్లు ఇచ్చాము.. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు.. మేము పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని ఆమె అన్నారు.

Read Also: Fevers attack on Merged Mandals: విలీన మండలాలను వణికిస్తున్న జ్వరాలు

నేనే ప్రధాని అన్నట్లుగా దేశమంతా తిరగుతున్నారని..దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి సమాధానం చెప్పండి అని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ పై ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణలో ప్రతీ పిల్లాడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వ కేంద్ర పథకాల పేర్లను మార్చుతుంది.. కేంద్రం ఒకటి పెడితే రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ బలవంతంగా చేరిందని ఆమె అన్నారు.

బీహార్ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశారని.. అక్కడి సీఎం, ఈ సీఎం మాట్లాడలేక లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టారీతిన పెంచుతున్నారని ఆరోపించారు. మన ఊరు- మన బడి కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్ గా చెప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 100 మంది రైతుల్లో 91 మంది రైతులు అప్పుల్లో ఉన్నారన్నారు. ఫసల్ బీమా ఎందుకు ఇవ్వదడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. లక్ష రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెద్దపెద్ద వాగ్ధానాలు ఇస్తున్నారు తప్పితే వాటిని నెరవేర్చడం లేదని అన్నారు. బడ్జెట్ అప్రూవల్ కన్నా ఎక్కువగా అప్పలు చేస్తున్నారని.. బయటకు తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని ఆరోపించారు. బడ్జెట్ లో చాలా అప్పులు చూపించడం లేదు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని..ఎఫ్ఆర్బీఎం లిమిట్ తెలంగాణ దాటి పోతుందని అన్నారు.

Exit mobile version