Site icon NTV Telugu

Finance Fraud : ఫైనాన్స్ పేరుతో మోసం..! స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ పై ఆగ్రహం

Finance

Finance

Finance Fraud : ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణానికి చెందిన స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం వల్ల అనేక మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంస్థ మోసపూరిత కార్యకలాపాలపై ఆగ్రహించిన బాధితులు, సంస్థ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంభంకు చెందిన నాగమణి, ఇషారమ్మ, ముబీనా వంటి పలువురు బాధితులు దాదాపు 16 నెలల క్రితం తమ కుటుంబ అవసరాల కోసం ఈ సంస్థలో రుణాలు తీసుకున్నారు. వారు క్రమం తప్పకుండా తమకు కేటాయించిన లీడర్‌కు ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చారు. అయితే, ఇటీవల మళ్లీ ఆర్థిక అవసరాల నిమిత్తం సంస్థను లోన్ అడిగేందుకు వెళ్లిన బాధితులకు ఊహించని షాక్ తగిలింది.

Pawan Kalyan: కెప్టెన్ దీపిక కోరికకు స్పందించిన డిప్యూటీ సీఎం.. వెంటనే చర్యలు

పాత లోన్ సరిగ్గా చెల్లించలేదని, అందువల్ల కొత్త లోన్ మంజూరు కుదరదని సంస్థ సిబ్బంది చెప్పడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాము సకాలంలో చెల్లింపులు చేసినప్పటికీ, సంస్థ ఉద్దేశపూర్వకంగా తప్పుడు రికార్డులు సృష్టించి తమకు కోర్టు నోటీసులు కూడా పంపిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థ మోసం కారణంగా తమ సిబిల్ స్కోరు పూర్తిగా దెబ్బతిందని, భవిష్యత్తులో ఇతర బ్యాంకులలో రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 15 మందికి పైగా ఇదే తరహాలో మోసానికి గురైనట్లు బాధితులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం స్పందించి, తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వెంటనే న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Dandora Song : సామాజిక అస‌మాన‌త‌ల‌ను ప్రశ్నించేలా ‘దండోరా’ టైటిల్ సాంగ్

Exit mobile version