NTV Telugu Site icon

Fight for 4 hundred Rupees: 400 వందల కోసం గొడవ.. లారీ కిందతోసి హత్య

400

400

Fight for 4 hundred Rupees: ప్రజల్లో క్రూరత్వం రోజురోజుకూ పెరిగిపోతోంది. క్షణికావేశంలో ఇతరుల ప్రాణాలు తీయడానికి తిరుగు లేదు. డబ్బు కోసమో, భూమి కోసమో.. ఏ కారణం చేతనైనా ఇతరుల ప్రాణాలు తీస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారు. బంధాలు, బాంధవ్యాలు మరిచి ఓ దుండగుడు ఆర్థిక లావాదేవీల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని హత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బాలానగర్‌లో జరిగిన దారుణ హత్య స్థానికంగా చాలాకలకలం రేపుంతోంది.

Read also: MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జైల్లో నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ

కాశీరాం, శ్రీనివాస్‌లు బాలానగర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రూ.400 కోసం గొడవ జరిగింది. డబ్బుల వివాదం కాస్త రచ్చ రచ్చగా మారింది. నర్సాపూర్ కూడలిలో కాశీరాం శ్రీనివాస్ పై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్పటికి కోపం చల్లారకపోవడంతో కాశీరాం శ్రీనివాస్‌ను వస్తున్న లారీ కిందకు తోసేశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Medak Church: మెదక్​ చర్చిలో క్రిస్మస్​ వేడుకలు.. భక్తుల రద్దీతో బయటనే ప్రార్థనలు

అయితే భాగ్యనగరంలో హత్యలు నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హత్యకు కారణాలు ఏవైనా ఆవేశంతో చేసిన పని జీవితాంతం జైలులో ఉండాల్సిన పరిస్థితి. ఏదైనా సమస్య ఉంటే మట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసేంత వరకు ఎళ్తున్నారు. ఇక పట్టపగలు హైదరాబాద్‌ లో వ్యక్తి దారుణ హత్యతో కలకలం రేపుతోంది. అందరూ చూస్తుండగానే పట్టపగలే రోడ్డపై వ్యక్తిని రూ400 కోసం కాశీరాం చేసిన పని అందిరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Show comments