NTV Telugu Site icon

LB Nagar Crime: బట్టలు ఆరేసే విషయంలో మహిళల మధ్య గొడవ.. కత్తితో దాడి..

Lb Nagar Crime

Lb Nagar Crime

LB Nagar Crime: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకు ఎదుటి వారిపై కోపం తెచ్చుకుని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మరి కొందరైతే ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా మహిళలే గొడవలు పెట్టుకుని చుట్టూ ఎవరు ఉన్నారు అని కూడా మర్చిపోతున్నారు. మాటతో పోయే దానికి కత్తులతో దాడులు చేసుకునేంత వరకు వస్తున్నారు. తాజాగా ఇంటి ముందు బట్టలు ఆరేసిన విషయంలో ఇద్దరు మహిళల మధ్య వార్‌ తారాస్థాయికి చేరింది. వారి కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడంతో ఇది కాస్తా ఇంకా పెద్దదిగా మారి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌ లో చోటుచేసుకుంది.

Read also: Suryapet Crime: తాటిచెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి.. మృతదేహాన్ని దించుతుండగా షాకింగ్ ఘటన

ఎల్ బి నగర్ భరత్ నగర్ లో బుజ్జి, కమలమ్మ అనే మహిళల కుటుంబం పక్కపక్కనే నివాసం ఉంటుంది. అయితే ఇద్దరు బాగానే స్నేహితులు కూడా. వీరిద్దరికి బట్టల ఆరేసే విషయంలో వాగ్వాదం చేసుకున్నారు. ఇది కాస్త పెద్దగా మారింది. నీ బట్టు తీసేయాలని బుజ్జి అనగా.. నేను తీయను నీ బట్టలే తీసేయాలని కమలమ్మ వాదించింది. దీంతో ఇద్దరి మద్య గొడవ తారాస్థాయికి చేరింది. కాగా.. గొడవల మధ్యలో వీరిద్దరి సోదరులు ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా భరత్‌ నగర్‌ వాసులందరూ రోడ్డుపైకి వచ్చి బుజ్జి, కమలమ్మ గొడవ ముచ్చట చూస్తుకూర్చున్నారు. ఇదంతా సాగుతుండగా.. ఆకస్మా్త్తుగా బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై మటన్‌ కత్తితో కలమ్మ సోదరుడు దాడి చేశాడు. విచక్షణా రహితంగా మెడను కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు కత్తితో శంకర్ మెడ కోయటంతో పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు శంకర్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.
Health Tips : కాలేయాన్ని రక్షించే కాఫీ.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..!

Show comments