Rangareddy Road accident: సరదాగా గడిపేందుకు 12 మందితో ఓఫియన్ పార్క్ కు వెళుతన్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు. కారులో ఇరుకున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీని వెనకాల నుండి మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో కారులో ఇరుక్కుని ఇద్దరు విద్యార్థినీలు, ఓ విద్యార్థి మృతి చెందారు. మృతుల్లో ఓ విద్యార్దిని దివ్యగా గుర్తించారు. శంకర్ పల్లి నుండి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది.
Read also: MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదు
నిజాంపేట్ కు చెందిన దివ్య ఆమెతోపాటు మరో కొంతమంది స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ నిమిత్తం గండిపేటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. వీరందరూ ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, విద్యార్ధులు. నిజాంపేట నుండి బయలుదేరి శంకర్‌పల్లి మీదుగా స్నేహితులను కారులో ఎక్కించుకొని 12 మంది ఓషియన్ పార్క్ కు బయలుదేరారు. మితిమీరిన వేగంతో రోడ్డు పై ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ డ్రైవింగ్ చేశారు. ఖానాపూర్ వైపు టిఫిన్ చేసేందుకు వెళ్లి తిరిగి రెండు, మూడు వాహనాలు ఒవర్ టేక్ చేస్తూ మితిమీరిన వేగంతో కారును నడిపారు. ఖానాపూర్ వద్ద పోచమ్మ గుడి దేవాలయం వద్ద నిలిచి ఉన్న TS 07 UK 9738 నెంబర్ గల లారీని అతివేగంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 12 మందిలో దివ్యతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. మౌఖిక, సుశ్ సుమితా, ధనుష్యా, అఖిల్ కు తీవ్ర గాయాలు కావడంతో ఎమర్జెన్సీ వార్డు లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నా దివ్వ కుటుంబం సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ఘటనకు కారణమని పోలీసులు స్పష్టంచేశారు.
Malkajgiri Crime: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య