NTV Telugu Site icon

Farmers: పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు.. వడ్లకు నిప్పంటించి నిరసన

Peddapalli

Peddapalli

Farmers protest: రాష్ట్రంలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది. వడగళ్ల వర్షానికి పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వడగళ్లు పడటంతో రైతులకు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో, రోడ్డుపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కల్లాల్లోకి తీసుకువచ్చి నెల రోజులు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట ఎలా వున్నా కొనాలని ఆదేశాలు జారీ చేసిన పంటలు కొనే దిక్కులేకుండా పోయింది. దీంతో సహనం కోల్పోయిన రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఆరేందుకు వేసిన వడ్లకుప్పపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Maharastra: భార్య మాటవిని.. మెచ్యూర్‌ అయిన చెల్లెల్ని కొట్టి చంపిన అన్న

పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో రహదారిపై బైఠాయించి అన్నదాతల ఆందోళన చేపట్టారు. నడిరోడ్డు మీద వడ్లకుప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం క్వింటాలుకు ఐదు కిలోల ధాన్యం కోత విదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7.5 కిలోలు కటింగ్ ఇస్తేనే కొనుగోలు చేస్తామంటున్న సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు వచ్చి మాట్లాడి వెల్లే వారే గానీ.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సెంటర్ ఇంచార్జ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసుకునేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. రైతుల ఆవేదనకు ప్రభుత్వం గుర్తించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుందా అనే ప్రశ్రలు వెల్లువెత్తుతున్నాయి.
TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే