Site icon NTV Telugu

సన్నరకం కాదని దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయడంపై రైతుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం లోడ్ కోసం వచ్చిన లారీని అడ్డుకున్నారు రైతులు. సన్నరకం ధాన్యాన్ని కాంటాలు పెట్టకుండా దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేయించేందుకు వచ్చిన అధికారులతో పాటు లారీని అడ్డుకున్నారు రైతులు. లారీ టైర్ కింద పడుకుని నిరసన వ్యక్తం చేసారు ఓ రైతు. వెంటనే సన్నరకం ధాన్యం కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.

Exit mobile version