Site icon NTV Telugu

Farmers Concern: రైతుల ఆందోళన.. గోదాంలో యూరియా కట్టల కోసం డిమాండ్

Formers Uriya

Formers Uriya

Farmers Concern: సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి యూరియాకోసం పడిగాపులు కాస్తున్న రైతులకు నిరస మిగలడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాంలో యూరియా అయిపోయిందని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. యూరియా ఇవ్వాలని రైతుల ఆందోళన చేపట్టారు. గోదాంలో ఎన్ని కట్టలు ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతుల ఆందోళన చేపట్టారు. రెండు లారీల యూరియా ఏమైందని ప్రశ్నించారు. రైతులు అడిగే ప్రశ్నకు సమాధానాలు లేక మాట అధికారులు దాటేశారు.

Read also: TS Congress: 17న హైద్రాబాద్ లో కాంగ్రెస్‌ సభ.. సోనియా సమక్షంలో తుమ్మల, మైనంపల్లి చేరిక..?

గోదాంలో ఎన్ని కట్టలు ఉన్నాయో చూపించాలని రైతుల ప్రశ్నలకు.. అధికారులు రైతులపై మండిపడ్డారు.. మీకు చూపించాల్సిన అవసరం లేదంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు బారులు కాస్తుంటే యూరియా లేదంటూ చేతులు దులుపుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఇచ్చేంత వరకు వెనక్కు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. యూరియా ఉందో లేదో చూపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నల్గొండ జిల్లాలోని హాలియాలో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాల కారణంగా యూరియాకు డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్ లో డీలర్ల వద్ద యూరియా లేకపోవడంతో రైతులు వ్యవసాయ సహకార సంఘాలకు క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం నుంచి వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చున్నారు.

Exit mobile version