NTV Telugu Site icon

వరంగల్ లో జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు…

వరంగల్ లో జాతీయ రహదారిని దిగ్బంధించారు రైతులు.. వరంగల్ రూరల్ వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ లో పోసిన ధాన్యం 15 నుండి 20 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని జాతీయ రహదారి 563 పై ధర్నా చేపట్టారు రైతులు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కాంటాలు అయ్యేలా పరిష్కరించాలని రైతులు కోరారు. మార్కెట్ సెక్రటరీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడని రైతులు ఆందోళన చేపట్టారు. స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ రైతులతో మాట్లాడి ధర్నా విరమిపజేసి ట్రాఫిక్ క్లియర్ చేసి లారీలను పంపిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కోసాగాడుతున్న ఓక్ డౌన్ లో వారి ధాన్యం కొనుగోళ్ళకు ప్రభుత్వం సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే.