Site icon NTV Telugu

మెదక్ జిల్లాలో కలకలం.. తహశీల్దార్‌పై రైతు..?

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. జిల్లాలోని తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు పొలం వద్ద కరెంట్ షాక్ తో చనిపోయాడు. అయితే, శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాశ్.. బాలుకు సకాలంలో పట్టాదార్ పాసుపుస్తకాలను ఇవ్వలేదని, దీంతో బాలుకు రైతు బీమా రాదని స్థానిక రైతులు ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ నిర్లక్యం వల్లనే ఇలా జరిగిందంటూ ఆగ్రహానికి గురైన ఓ రైతు వెంట తెచ్చుకున్న డీజిల్ బాటిల్‌ను ముందుగా తనపై పోసుకొని, ఆపై తహశీల్దార్‌ పై పోశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తం అవ్వడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు స్థానిక రైతులు-తహశీల్దార్‌ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Exit mobile version