Site icon NTV Telugu

Fake Liquor : రైస్‌ మిల్లులో స్పిరిట్‌తో నకిలీ లిక్కర్‌ తయారీ గుట్టురట్టు

Fake Liquor

Fake Liquor

Fake Liquor : హైదరాబాద్‌ శివారులో ఎక్సైజ్‌ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ ముఠాను పట్టుకున్నారు. చీప్‌ లిక్కర్‌తో పాటు నాటు సారాను కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు.

ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్‌ను సేకరించి చీప్ లిక్కర్‌ను ఖరీదైన మద్యం పేరుతో విక్రయిస్తున్న ఈ గ్యాంగ్‌ పెద్ద ఎత్తున నకిలీ సీసాలు మార్కెట్లోకి పంపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Aamir Khan : దేశాన్ని ఊపేసిన హనీమూన్ హత్యపై అమీర్ ఖాన్ సినిమా?

దాడిలో వేల లీటర్ల నకిలీ మద్యం, పెద్ద మొత్తంలో ఖాళీ సీసాలు, క్యాప్స్‌, ప్రముఖ బ్రాండ్ల నకిలీ లేబుల్స్‌ స్వాధీనం అయ్యాయి. నకిలీ లిక్కర్ తయారీ కోసం ముఠా చిన్నపాటి పరిశ్రమ స్థాపించి పద్ధతిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ముఠా కార్యకలాపాలు బయటపడడంతో ఎక్సైజ్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నగరం పరిసరాల్లో ఇలాంటి నకిలీ లిక్కర్ తయారీ యూనిట్లు ఉన్నాయా అనే దానిపై విస్తృతంగా దర్యాప్తు చేపట్టనున్నారు.

Earthquake: హర్యానాలో భూకంపం… ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు

Exit mobile version