బంజారాహిల్స్ లో ఓ నకిలీ ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఖమ్మం సిఐ పేరుతో ఒక వైద్యుడుకి ఫోన్ చేసి 75 లక్షలు డిమాండ్ చేసాడు నిందితుడు. గతంలో తన ఇంట్లో డ్రైవర్ గా పని చేసాడు మహేష్ అనే వ్యక్తి. అయితే మహేష్ వద్ద వైద్యుడుకి సంబందించిన కాల్ రికార్డింగ్ లు ఉండటంతో అతడిని విధుల్లో నుండి తొలగించాడు వైద్యుడు. మహేష్ తనకు తెలిసిన వ్యక్తి తో నకిలీ పోలీస్ అవతారం ఎత్తించి వైద్యుడికి ఫోన్ చేయించాడు. 75 లక్షలు ఇవ్వకుంటే ఆడియో రికార్డింగ్ లు బయట పెడుతూ అని బెదిరించాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు వైద్యుడు. ధనతో పక్క ప్లాన్ తో మాటు వేసి అతడిని పట్టుకున్నారు బంజరహహిల్స్ పోలీసులు.