NTV Telugu Site icon

Bhadradri: భద్రాద్రి రాముడి ఫేస్ బుక్ పేజీపై మెక్సికో హ్యకర్ల దాడి

Kmm1

Kmm1

భద్రాద్రి రాముడిని వదలడం లేదు కొంతమంది ఆగంతకులు. రామాలయం ప్రతిష్ట దిగజార్చేలా సోషల్ మీడియాలో ఆశ్లీల చిత్రాలు పెట్టారు. సాక్షాత్తు భద్రాచలం ఆలయం విశిష్టతను వివరించే ఫేస్ బుక్ పేజీలోకి మెక్సికో దేశానికి చెందిన హ్యకర్లు చొరబడ్డారు. పేజీలో అశ్లీల చిత్రాలు పెట్టారు. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు దేవుడిని అవమానపరిచారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు.

అయితే దీనిపై నిర్వాహకులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా.. తమ పేరుపై ఎలాంటి ఫేస్ బుక్ అకౌంట్ లేని దేవస్థాన వర్గాలు తెలుపుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీరాముడి ఆలయ ప్రతిష్టను దిగజార్చేందుకే కొంత మంది ఇలా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. భద్రాచలం దివ్య క్షేత్రం పేరుతో ఈ అక్కౌంట్ ను గత అయిదేళ్ల నుంచి
నడుపుతున్నారు. ఇందులో ప్రత్యక్షంగా యాబై వేల మంది సభ్యులు ఉండగా, వారికి మద్దతుగా మరో యాబై వేల మంది సభ్యులు ఉన్నారు. ఇందులో రాముడి ప్రాశస్త్యాన్ని మాత్రమే వివరిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఎఫ్ బీ అకౌంట్ లోకి కొంతమంది చొరబడ్డారు.

గత శనివారం నాడు మెక్సికో కు చెందిన కొంతమంది ఈ ఫేస్ బుక్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఫేస్ బుక్ ఐడి ని తమ ఆధీనంలోకి తీసుకుని.. అశ్లీల చిత్రాలను ఇందులోొ పెట్టారు. ఇదే విధంగా ఫేస్ బుక్ నిర్వహకులను తమ ఐడీలు కూడా ఇవ్వమని కూడా హెచ్చరించారు. అయితే ఇందుకు వీరు నిరాకరించారు. దీని గురించి సమాచారం అందుకున్న నిర్వహకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భద్రాచలం పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఐడీలో ఉన్న అశ్లీల ఫోటోలను తీయించేశారు.

Bhadradri: ఆగంతకుల దుశ్చర్య.. రాముడిని వదల్లేదు

Show comments