Fake Baba in Vemulawada: మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లకు కొదవలేదు. ఈజీగా మనీ సంపాదించేందుకు మోసాలకు తెగబడుతుంటారు. మూఢ నమ్మకాలతో ప్రజలను మోసం చేస్తూ అందినకాటికి దోచేస్తుంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారిని నమ్మేవారు ఉన్నారంటే అది ప్రజల మూర్ఖత్వమే అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వారిని నమ్మవద్దని పోలీసులు, అధికారులు చెబుతున్నా అవన్నీ పక్కన పెట్టి మోసపోయి లబోదిబో మంటూ మళ్లీ పోలీసుల వద్దకే సహాయం కోసం వస్తుంటారు. అధికారులు ఎంత అలర్ట్ గా ఉండాలని చెప్పిన ప్రజలు మాత్రం ఇలాంటి నకిలీ బాబాలను నమ్మి మోసపోతుంటారు. ఇలాంటి వారిని వద్ద నుంచి డబ్బులు దండుకునేందుకు ఏకంగా ఒక వ్యక్తి దేశగురువు అవతారమెత్తి తనను తాను బాబాగా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ప్రత్యేక పూజల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నాడు.
దేశ గురువు పేరుతో గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్న వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి మరి ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొడతాడని ఇందులో నచ్చినంత కట్నం వేసుకోవాలని చెబుతున్న దోషాల పేరుతో ప్రజలను బాబా భయపట్టిస్తున్నాడని ఆరోపణ వస్తున్నాయి. దీంతో 500 నుండి 5వేల రూపాయల వరకు పూజల పేరుతో వసూళ్లకు పాల్పడుతుండగా సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. అయితే ఈ బాబా వ్యవహారంపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఎస్.ఐ.నాగరాజు స్పందిస్తూ బురిడీ బాబాను నమ్మవద్దని ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రూరల్ మండలంలోని అనేక గ్రామాల్లో తిరిగిన బాబా వేలాది రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు గురువులమని చెప్పుకుని బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని.. పూజల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.
Kerala: రేయ్ నువ్వు భర్తేనా.. నీప్రెండ్ తో గడపలేదని భార్యనే చంపేస్తావా?