Site icon NTV Telugu

Sangareddy Crime: పేలిన గ్యాస్ సిలిండర్.. పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకున్న మంటలు

Sangareddy Crime

Sangareddy Crime

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. దీంతో భారీ శబ్దం రావడంతో.. స్థానికులు ఏం జరిగిందో అంటూ బయటకు పరుగులు పెట్టారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపడింది. ఇంటికి మొత్తం మంటలు అంటుకున్నాయి. పెంకుటిల్లు కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక పక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు అంటుకున్నాయి. మంటలను ఆర్పే స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓకుటుంబం నివాసం ఉంటుంది. రోజూ లాగానే లేచిన మహిళ వంట చేసేందుకు గ్యాస్‌ అంటించింది. అంతే ఒక్క సారిగా భారీ శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. బయటకు వచ్చిన స్థానికులకు అరుపులు వినపడంతో గ్యాస్‌ పేలిన ఇంటి వైపు పరుగులు పెట్టారు. అక్కడి వెళ్లి చూడగా.. భారీగా మంటలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి. కొందరు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిసి పడింది. పక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు, పొగ కమ్ముకుంది. స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఇంట్లో ఎంత మంది ఉన్నారు, మృతుల విషయం పై ఇంకా క్లారిటీలేదు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Bengaluru Traffic: లంచ్‌ @ ట్రాఫిక్ జామ్‌.. వీడియో వైరల్

Exit mobile version