NTV Telugu Site icon

Jaggery Destroy: వాగులో బంగారం….ఎందుకో తెలుసా?

Jaggery

Jaggery

తెలంగాణలో బంగారం పేరు చెబితే భక్తి మదిలో మెదులుతుంది. సమ్మక్క సారలమ్మలకు భక్తులు ఎంతో ప్రేమతో బంగారం అంటే.. బెల్లం నైవేద్యంగా పెడతారు. అయితే ఆ బంగారం పేరుతో కొంతమంది అక్రమార్కులు నల్లబంగారం అక్రమ రవాణా చేస్తూ ఎక్పైజ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల కిందట పట్టుకొని సీజ్ చేసిన నల్ల బెల్లన్నీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బయ్యారం పాకాల వాగులో బెల్లం, పటిక బస్తాలను నిర్వీర్యం చేశారు..

బయ్యారం మండలంలో అక్రమంగా నిల్వచేసిన నల్లబెల్లం,గుడంబా స్థావరాలపై దాడులు చేసి పట్టుకున్న నల్ల బెల్లం, పట్టికను పాకాలవాగులో పడేశారు ఆధికారులు. రెండు సంవత్సరాలుగా బయ్యారం పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి వున్న బెల్లం, పటికను దాచి పెట్టారు. నాలుగు ట్రాక్టర్ల ద్వారా ఈ నల్లబెల్లం, పటికను తీసుకు వచ్చారు పోలీసులు. ఆ బస్తాలను పాకాల వాగులో పడేస్తుంటే జనం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బయ్యారం ఎస్ ఐ రమాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నల్లబెల్లం, పటిక ద్వారా అక్రమంగా లక్షలాది రూపాయల విలువైన గుడంబా తయారుచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతూ వారి ఆరోగ్యానికి చేటు తెస్తుంటారు అక్రమార్కులు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా దాడులు చేస్తారు. అలా దొరికిన బెల్లాన్ని వాగులో కలిపేస్తారు. ఏపీలో అక్రమ మద్యం బాటిళ్లను రోడ్లు రోలర్లతో తొక్కిస్తుంటారు. అలా ఈ బెల్లాన్ని వాగులో పడేయడంపై మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు.

Covid Booster Dose: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఉచితంగా బూస్టర్ డోస్.. ఎప్పటినుంచంటే?