NTV Telugu Site icon

Munugode by Poll: మునుగోడు పోరు.. రెండు పోలింగ్‌ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు

Munugode By Poll

Munugode By Poll

Munugode by Poll: మునుగోడు నియోజక వర్గంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటును వినియోగించుకునేందుకు ఓటింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. మునుగోడు ఎన్నికల పోలింగ్‌ సరళిపై బండిసంజయ్‌ ఆరా తీస్తున్నారు. అయితే.. మర్రిగూడలో బీజేపీ నాయకుల ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించారు. గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు మర్రిగూడలో ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. పోలింగ్‌ నిలిపివేయాలంటూ పోలీసులతో బీజేపీ శ్రేణులు వ్యాగ్వాదానికి దిగారు. సిద్దపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు బీజేపీ కార్యకర్తలు అప్పగించారు. వీడియోలు తీస్తున్నామనే నెపంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బీజేపీ శ్రేణులు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిపై లాఠీ చార్జ్‌ చేసి అక్కడనుంచి వెల్లగొట్టారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Read also: Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో

మునుగోడులో కొంపల్లి 145వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం లు మొరాయించాయి. 25 ఓట్లు పోలయ్యాక ఈవీఎంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈవీఎం మొరాయింపుతో గంటనుంచి పోలింగ్‌ నిలిచింది. ఇక చండూరులో స్వల్ప ఉద్రిక్తత స్థానికేతరులు చండూరులోని ఓ ఇంట్లో ఉన్నారని గుర్తించిన బీజేపీ శ్రేణులు ఘటనాస్థలికి వెల్లడంతో స్థానికేతరులు పరారయ్యారని బీజేపీ శ్రేణులు ఆరోపించారు. అదే సమయంలో ఘటనా స్థలికి వెళ్లిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తులు వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అక్కడ చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ చండూరు మండలంలో ఇడికూడలో 173వ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.