Site icon NTV Telugu

తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : ఈటల

ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరు. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేసాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసాను ప్రజల్లో బలమున్నవారు చేసే పనులు ఇవి కావు. బలహీనులు కాబట్టే వాళ్లు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు అని తెలిపారు.

కానీ మోడీ సర్కారు సామాజిక న్యాయాన్ని పాటిస్తోంది. అందుకే 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానమిచ్చారు. ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికే మాత్రమే అవకాశం ఇచ్చారు. 0.5శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడబోము. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు తప్ప, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు అని పేర్కొన్నారు.

Exit mobile version