NTV Telugu Site icon

ఇక తిరుగేలేదు.. 11 వేలు దాటిన ఈటల ఆధిక్యం

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో భారీ విజయం వైపు దూసుకెళ్తున్నారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌… ఇప్పటి వరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. ఈటల ఆధిక్యం 11 వేలు దాటేసింది.. 15వ రౌండ్‌లోనే ఈటలకు 2,149 ఓట్ల ఆధిక్యం దక్కగా.. మొత్తంగా ఆయనకు ఇప్పటి వరకు వచ్చిన మెజార్టీ 11,583 ఓట్లుగా ఉంది. ఇక, ఈటల విజయానికి తిరుగేలేదని ఆనందాన్సి వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ఉత్సవాల్లో మునిగిపోయాయి.. 15వ రౌండ్‌ ముగిసే సరికి.. బీజేపీకి 63,079 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌కు 53,645 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 1,982 ఓట్లకే పరిమితం అయ్యింది. ఇక, ఇల్లంతకుంట, కమలపూర్ మండలాల్లో ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. ఆ మండలాల్లో ఈటలకే అత్యధిక ఓట్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి.. దీంతో.. ఈటలకు 25 వేలకు పైగా ఓట్లతో విజయం సాధిస్తారనే లెక్కలు వేస్తున్నారు పార్టీ నేతలు.