NTV Telugu Site icon

హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల వర్గీయుల అరెస్ట్…

హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రములో కేసీఆర్ కు మద్దుతుగా ప్రెస్ మీట్ పెట్టు తుండగా ఈటల వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మద్య తోపులాట జరిగింది. దాంతో ఈటల వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేసారు. కరోనా సమయంలో నిబందనలు ఉల్లఘించి మద్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ప్రశ్నిచారు ఈటెల వర్గీయులు. తమకు 10 గంటల లోపే అనుమతి అని చెప్పి ఇప్పుడు పోలిసులు ఎలా పరిమిషన్ ఇచ్చారని ప్రశ్నించిన ఈటెల వర్గం… గ్రామంలో కరోనా కేసులు బాగా అవుతున్నాయి. ఇంత మంది గుమికూడదు కావాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారని వీణవంక గ్రామశాఖ తెరాస అద్యక్షుడు మో టం వెంకటేశ్, ఇల్లంతకుంట దేవస్థాన కమిటి మెంబర్ దాసరపు రాజు, రాయ్ శెట్టి కుమార్ లు అడ్డుకున్నారు. దాంతో ఈటెల వర్గీయులను పోలీసులు స్టేషన్ తీసుకువెళ్లారు.