Site icon NTV Telugu

Etela Rajender : కేసీఆర్‌ సంస్కారం ఏపాటిదో అర్థమవుతోంది

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక-సారక్క జాతార ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 16 నుంచి 19వ తేది వరకు కన్నుల పండుగవగా జాతరను నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకుంనేందుకు కోట్లాది మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారంకు విచ్చేశారు. అయితే నిన్న తెలంగాణ తొలి మహిళ (గవర్నర్‌) తమిళసై సౌందరరాజన్‌ అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ మర్యాద కూడా ఇవ్వకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. మేడారంలో గవర్నర్‌ను అవమాంచారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంస్కారహీనమైన సంప్రదాయానికి తెర తీశారని, సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో అర్థమవుతోందన్నారు.

కేసీఆర్ పుట్టి‌నరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్‌కు గుర్తుచేస్తున్నాని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్‌వి చిల్లర వ్యాఖ్యలు ఆయన మండిపడ్డారు. ప్రజా ఆగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబయ్ పర్యటనకు వెళ్లాడని అన్నారు. జాతీయ పార్టీ లేకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Exit mobile version