వీణవంక గడ్డ ఇచ్చిన చైతన్యంతోనే కేసీఆర్ ప్రజావ్యతిరేక పనుల మీద గర్జించిన అని ఈటల రాజేందర్ అన్నారు. ఐకేపీ సెంటర్స్ పెట్టాలని డిమాండ్ చేసిన. నర్సంపేట, పెద్దపల్లి ఎమ్మెల్యే లు, మంత్రి హరీష్ రావు ఈ మండలంలో తిరుగుతున్నారు. ఇక్కడే మీటింగ్ పెట్టి నన్ను విమర్శించారు. కేసీఆర్ పంతం పడితే హరీష్ పని చేస్తున్నారు. హరీష్ అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ నీ ఆటలు ఈ గడ్డ మీద సాగవు అని తెలిపారు ఈటల. ఇక 70 కోట్ల రూపాయల లిక్కర్ ఇక్కడ ప్రజలకు తాగిపించారు కేసీఆర్. పెన్షన్లు ఇచ్చినా, దావత్లు ఇచ్చినా అవన్నీ ఈటల రాజేందర్ వల్లనే వచ్చాయి అని మర్చిపోకండి ప్రజలారా అని గుర్తు చేసారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనేవారు కళ్ళులేని కబొదులు. వీణవంక వాగు పై 10 చెక్ డ్యామ్ లు కట్టించిన. వాగు జలకళతో నిండుగా ఉంది. నేను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలు గెలిచినట్టు, తెలంగాణ ప్రజలు గెలిచినట్టు. ఏ ఊరికి ఆ ఊరు మీరే కథానాయకులు అయ్యి, ఒక్కొక్కరు ఒక్కో ఈటల రాజేందర్ అయ్యి ఎన్నికలలో పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఈటల పేర్కొన్నారు.
కేసీఆర్ ఆటలు ఈ గడ్డ మీద సాగవు : ఈటల
