Site icon NTV Telugu

సిఎం కెసిఆర్ పై ఈటల షాకింగ్ కామెంట్స్..

ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన పార్టీకి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటలపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీటికి ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈటల రాజేందర్ మరోసారి సిఎం కెసిఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాచరికాన్ని బొంద పెట్టడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చైతన్య వంతమైన నియోజకవర్గ హుజురాబాద్ అని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు గెలిపించారని ఈటల తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆశీర్వాదాలు అందాయని.. బిడ్డా కేసీఆర్ నీకు అన్యాయం చేసిండు అని అంటున్నారని పేర్కొన్నారు. చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారని.. మా ప్రజలు ప్రేమకు లొంగుతారు.. ప్రగల్బాలకు లొంగబోరని చురకలు అంటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏది చెప్పినా ప్రజలు నమ్మరని.. హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ అహంకారానికి ఘోరీ కట్టడం ఖాయమని.. దానికోసం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రేపటి నుండి ఇంటి ఇంటి ప్రచారం చేస్తాననని.. ప్రగతి భవన్ లో రాశిస్తే.. చదివే మంత్రులు కుటుంబాల్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలని ఫైర్ అయ్యారు.

Exit mobile version