NTV Telugu Site icon

Etela Rajender: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం..

Etala Rajender

Etala Rajender

Etela Rajender: ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో, పాలకుర్తి నియోజకవర్గం స్థాయి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఈటట మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని అన్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత చీత్కరింపబడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ఆర్ఆర్ టాక్స్ పేరుతో తెలంగాణలో వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తుందని సాక్షాత్తు మోడీ, అమిత్ షా నే తెలిపారన్నారు.

Read also: Minister Jupally Krishna Rao: కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా..

తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని,ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవాలని నిరుపేదలు ఆస్తుల అమ్మి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. నిరుపేదలకు వైద్యం ఖర్చులు పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు ఇస్తున్నారని అన్నారు.
Love Marriage: ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడిపై యువతి పేరెంట్స్‌ దాడి..