Site icon NTV Telugu

TRS MLC Kaushik Reddy: ఈటల.. హుజురాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్..!

Trs Mlc Kaushik Reddy

Trs Mlc Kaushik Reddy

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కౌసిక్‌ రెడ్డి ఈటల రాజేందర్‌ పై సంచళన వ్యాఖ్యలు చేసారు. ఈటల హుజురాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అంటూ విమర్శించారు. హుజురాబాద్ ప్రజలు ఏమి అన్యాయం చేశారని గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని అంటున్నావు ? అంటూ ప్రశ్నించారు. ఆగస్టు 5 న హుజురాబాద్ అభివృద్ధి పై చర్చకు ఈటల రాజేందర్ రావాలని సవాల్‌ విసిరారు. తను విసిరిన సవాల్ ను ఈటల రాజేందర్ స్వీకరించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ చేతకాని దద్దమ్మ, హుజురాబాద్ ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఈటల హుజురాబాద్ లో యాక్టర్…హైదరాబాద్ లో జోకర్ …ఢిల్లీలో బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

read also: Punjabi Debut: మరో భాషా చిత్రంలోకి అమైరా దస్తుర్!

హుజురాబాద్ అభివృద్ధికి బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రం నుంచి 100 కోట్లు ఈటల తీసుకోవాలని అన్నారు. అప్పుడు మేము రాష్ర్ట ప్రభుత్వం నుంచి 150 కోట్లు ఇస్తామని తెలిపారు. నేను జూనియర్ అంటున్నావు, మరి కేసీఆర్ తో నీకు పోటీ ఏంటి ? అని ప్రశ్నించారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు ఈటల కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల పెద్ద మోసగాడు, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. హుజురాబాద్ ప్రజలకు కూడా ఇప్పుడు ఈటల వెన్నుపోటు పొడుస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నెల 5 న హుజురాబాద్ కు చర్చకు ఈటల రాకపోతే, ఆయన అభివృద్ధి చేయలేదని అంగీకరించినట్టు అంటూ వ్యాఖ్యలు చేసారు. నియోజకవర్గములోని అన్ని శిలాఫలకలపై ఈటల పేరు ఉందని విమర్శించారు.

Praveen Chikkodi: నాపై వస్తున్న వార్తలు అవాస్తవాలు.. ఈడీ విచారణలో ప్రవీణ్ చికోడి

Exit mobile version