Site icon NTV Telugu

Engineering Student: గంజాయికి బానిసైన యువకుడు.. రైలు కిందపడి ఆత్మహత్య

Engjaneering Student Susaid

Engjaneering Student Susaid

Engineering Student: రైలు కిందపడి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. గంజాయికి బానిసై మానేయడం కష్టమని భావించి చివరికి తన ప్రాణాలను తీసుకున్నాడు. నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విజయకుమార్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్ నుంచి సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి పడిఆత్మహత్య చేసుకున్నాడు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాల ఆధారంగా విజయకుమార్ గా గుర్తించారు పోలీసులు. వెంటనే తాను చదువుతున్న కళాశాల యాజమాన్యానికి, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్ కు సమాచారం అందించాడు. ఘట్‌కేసర్‌లోని ఓ కళాశాలలో డిప్లొమా చదువుతున్న సమయంలో విజయ్‌కుమార్‌ గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించడంతో వ్యసనానికి బానిసయ్యాడని తండ్రి శ్రీనివాస్ తెలిపారు. ఫస్టియర్ లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మానేసి చర్లపల్లిలో చికెన్ సెంటర్ ప్రారంభించాడు.

Read also: Ambati Rayudu Quits YSRCP: బ్రేకింగ్‌: వైసీపీకి అంబటి రాయుడు గుడ్‌బై..

విజయ్‌కుమార్‌ మానసిక క్షోభకు గురై సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. కానీ చదువుకుంటానని విజయకుమార్ తల్లిదండ్రులకు చెప్పడంతో.. నార్లపల్లిలోని ఉన్నత పాఠశాలలో చేర్పించి అక్కడే హాస్టల్‌లో జాయిన్ చేశారు. కొన్ని నెలలుగా బాగోలేదని తల్లిదండ్రులు చెప్పడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. అయితే కొడుకు ఆత్మహత్య చేసుకోవద్దని తండ్రి ధైర్యం చెప్పాడు. అప్పుడు సరే అంటూ తల ఊపిన కొడుకు అన్నంతపని చేస్తాడని ఊహించలేని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అయితే విజయకుమార్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆ క్రమంలో గంజాయి దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన విజయ్‌కుమార్‌ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Guntur Kaaram: బాబుతో అట్లుంటది మరి.. విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డు!

Exit mobile version