NTV Telugu Site icon

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో రూ.130 కోట్ల స్కామ్.. 41 మందిపై ఈడీ చార్జిషీట్

ED chargesheet

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఎన్నో అక్ర‌మాలు వెలుగు చూశాయి.. పాత క‌రెన్సీ మారిస్తే.. భారీ క‌మిష‌న్‌లు.. ఇక‌, పాత క‌రెన్సీతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జ‌రిగిన‌ట్టు.. ఇలా చాలా ర‌కాల కొత్త స్కామ్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.. సామాన్యుడు మాత్రం బ్యాంకుల ద‌గ్గ‌ర, ఏటీఎంల ద‌గ్గ‌ర గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో నిల‌బ‌డితే.. ప్ర‌ముఖులు మాత్రం.. తెర‌వెనుక పెద్ద క‌థే న‌డిపించారు.. అయితే.. తాజాగా, 25 మంది బంగారం వ్యాపారులు, 16 మంది చార్టెడ్ అకౌంటెల్ల‌పై చార్జిషీట్ దాఖ‌లు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).. నోట్ల రద్దు సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ జ్యువలరీ షాపు యజమానుల‌ను గుర్తించిన ఈడీ.. బంగారం షాపు యజమానులతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ల‌పై సీసీఎస్‌లో న‌మోదైన కేసుల ఆధారంగా ఈడీ విచార‌ణ చేప‌ట్టింది.. మొత్తం 111 మంది పేర్లను ఈడీ పేర్కొంది.. ముసద్దిలాల్‌తో పాటు కుటుంబ సభ్యులు పేర్లు చార్జిషీట్లో చేర్చిన ఈడీ.. మొత్తంగా.. రూ.130 కోట్ల స్కామ్ జ‌రిగిన‌ట్టు చెబుతోంది.. బంగారం కొనుగోలు జరగకపోయినా నకిలీ ఖాతాదారుల పేర్ల మీద.. జువెల‌రీ షాపు య‌జ‌మానులు నగదు బదిలీ చేసిన‌ట్టు గుర్తించింది.. ఇలా నోట్ల రద్దు సమయంలో 130 కోట్ల రూపాయలను మార్పిడి చేశారు జువెలరీ షాపుల‌ యజమానులు.. ఈ వ్య‌వ‌హారంలో.. ముసద్దిలాల్ జ్యువెలర్స్ తో పాటుగా పలువురు బంగారం షాపు యజమానులపై ఈడీ చార్జిషీట్ దాఖ‌లు చేసింది..