Site icon NTV Telugu

Endela Lakshminarayana: కేంద్ర నిధులతో చేపట్టే పనులకు.. టీఆర్ఎస్ రంగులు వేసుకుంటోంది

Endela Laxminarayana

Endela Laxminarayana

Endela Lakshminarayana Comments On CM KCR: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మోడీ 20 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన.. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఇస్తోన్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కానీ.. ఆ పనులన్నీ తామే చేస్టున్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రంగులు వేసుకుంటోందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ రైతు బందు పథకం పెట్టకముందు రైతులకు ఎన్నో సబ్సిడీలు ఉండేవని, కానీ ఇప్పుడు వాటిని బంద్ చేశారని ఆరోపించారు. రైతు బందు ఇస్తానని హామీ ఇచ్చి, దళితుల్ని మోసం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం దళితుల ఓటు బ్యాంక్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు, కేసీఆర్ ఆ పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ఇక వడ్లు కొనేది కేసీఆర్ కాదు.. ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అని యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే కమిషన్‌లతోనే కొనుగోలు కేంద్రాలు నడుసతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ.. కొత్తపల్లి మనోహరబాద్ రైల్వే లైన్ పనులు నత్త నడకన నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు జారీ చేసిందని.. కానీ టీఆర్ఎస్ నేతలు నిధులు ఇవ్వడం లేదని అబద్ధాలు చెప్తున్నారని చెప్పారు. చివరికి.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌ని కూడా కేంద్రం సహకారంతోనే కేసీఆర్ ఇస్తున్నాడని తెలిపారు. కానీ, తామే అందిస్తున్నట్టుగా టీఆర్ఎప్ప గొప్పలకు పోతోందన్నారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్ రావుపై కౌంటర్ వేశారు. నేతి బీరకాయలో నేతి లేనట్లు.. మంత్రి హరీష్ రావుకి నీతి లేదని యెండల లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు.

Exit mobile version