Nampally Numaish: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాదాపు 2400 స్టాల్స్‌తో ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈసారి స్టాల్ హోల్డర్ల విజ్ఞప్తి మేరకు నుమాయిష్ ను మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో నుమాయిష్ 18న ముగియనుంది.
Read also: HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కాగా.. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. నుమాయిష్‌కు సహకరించిన అధికారులు, స్టాల్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి బి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్‌సింగ్, కోశాధికారి ఏనుగుల రాజేందర్‌కుమార్, వనం వీరేందర్, హరినాథ్‌రెడ్డి, వినయ్ ముదిరాజ్‌తోపాటు వివిధ మేనేజింగ్ కమిటీల సలహాదారులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
Revanth Reddy: హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు..