NTV Telugu Site icon

AP-TS Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

Namination Time I Sup

Namination Time I Sup

AP-TS Nominations: రాజకీయ నేతలు తొందర పడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపు చివరి తేదీ కావడంతో ఇవాళ, రేపు భారీ ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలంగాణ (17), ఏపీ (25) లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, జుర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్‌లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Read also: Maheshwar Reddy: 14 స్థానాలు గెలువరని సవాల్ విసిరా.. సీఎం రేవంత్‌ స్పందించలే..

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నిన్న (మంగళవారం) మొత్తం 415 నామినేషన్లు దాఖలయ్యాయి, ఏపీలో 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2 వేల 350 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కాగా, వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. ఎల్లుండి.. అంటే 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన హరీష్ రావు