Site icon NTV Telugu

జనసేనకి ఊహించని ఎదరుదెబ్బ..

తెలంగాణలో జనసేనకు షాక్ తగిలింది. తెలంగాణలో జరుగనున్న రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన (గాజుగ్లాసు).. తన కామన్ గుర్తును కోల్పోయింది. గత ఏడాది జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లకు పోటీ చేయని తరుణంలో జనసేన కామన్ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నిర్ణయంతో కంగుతిన్న జనసేన.. ​గ్రేటర్ ఎన్నికల్లో బిజేపి తో పొత్తు కారణంగా ఓట్ల చీలిక నివారణకు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్ఈసీకి పంపించిన లేఖలో జనసేన అధ్యక్షుడు తెలిపారు. త్వరలో జరిగే రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలలో తాము పోటీ చేయాలని నిర్ణయించడంతో తమ అభ్యర్థులకు గాజుగ్లాస్ కామన్ సింబల్ ను కొనసాగించాలని ఎస్ఈసి ని కోరారు. అయితే జనసేన విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తిరస్కరించారు.

Exit mobile version