Site icon NTV Telugu

Egg Price Hike : కొండేక్కిన కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ధర ఎంతంటే?

Eggss

Eggss

డిసెంబర్ నెలలో కార్తీకమాసం కారణంగా చికెన్ ధరలు ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా రూ. 100 కేజీ పలికింది.. గత వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది.. వారం, వారం ధరల్లో మార్పులు కనిపిస్తూ సామాన్యులకు నిరాశ కలిగిస్తున్నాయి..

గత వారం కింద ఒక్కో గుడ్డు రూ. 7ఉండగా, ఇప్పుడు రూ.8కు చేరినట్లు తెలుస్తుంది.. హోల్ సేల్​లో ఒక్కో గుడ్డు రూ.8 పలుకుతోంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లో ఎగ్స్​కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు.. మిగితా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు..

గత 15 రోజుల క్రితం కేసు ధర రూ.160 ఉండగా, రిటైల్‌ మార్కెట్‌లో రూ.6కు విక్రయించారు. ప్రస్తుతం కేసు ధర రూ.180 నుంచి రూ.200 చేరడంతో రిటైల్‌ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. మార్కెట్ లో ధర ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కాగా, చలికాలం కావడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, మామూలు రోజులతో పోలిస్తే చలికాలంలో గుడ్ల ఉత్పత్తి 60 శాతం నుంచి 70 శాతానికి పడిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు.. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్ లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్​వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

Exit mobile version