Egg Price Hike : కొండేక్కిన కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ నెలలో కార్తీకమాసం కారణంగా చికెన్ ధరలు ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా రూ. 100 కేజీ పలికింది.. గత వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది.. వారం, వారం ధరల్లో మార్పులు కనిపిస్తూ సామాన్యులకు నిరాశ కలిగిస్తున్నాయి..
గత వారం కింద ఒక్కో గుడ్డు రూ. 7ఉండగా, ఇప్పుడు రూ.8కు చేరినట్లు తెలుస్తుంది.. హోల్ సేల్‌లో ఒక్కో గుడ్డు రూ.8 పలుకుతోంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎగ్స్‌కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు.. మిగితా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు..
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
గత 15 రోజుల క్రితం కేసు ధర రూ.160 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.6కు విక్రయించారు. ప్రస్తుతం కేసు ధర రూ.180 నుంచి రూ.200 చేరడంతో రిటైల్ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. మార్కెట్ లో ధర ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కాగా, చలికాలం కావడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, మామూలు రోజులతో పోలిస్తే చలికాలంలో గుడ్ల ఉత్పత్తి 60 శాతం నుంచి 70 శాతానికి పడిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు.. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్ లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!