Edupayala Manjira River of Medak stinks: మెదక్ జిల్లాలో ఏడు పాయలలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. నేడు మాఘ అమావాస్య కావడంతో మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించనున్న భక్తులు తీవ్ర నిరసకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో.. కనీస ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేయలేదని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో కంపుకొడుతున్న మంజీరా నదిలో స్నానం చేయాలంటే ముక్కు ముసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంజీరా లోని నీరు రంగులు మారిందని వాపోతున్నారు. డ్రైనేజ్ వ్యర్దాలు నదిలోనే కలుస్తుండటంతో కంపుకొడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు భక్తులు. పుణ్య స్నానాలు చేద్దామని వచ్చిన భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Read also: Magha Amavasya: నేడు మాఘ అమావాస్య.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పుణ్య స్నానాలు ఎలా ఆచరించాలని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఇంతటి ప్రతిష్టాత్మకంగా వున్న ఆలయం వద్ద ఆలయ అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండటం విడూరంగా వుందని వాపోతున్నారు. ఇవాళ మాఘ అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఇలాంటి నీటి స్నానం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో కూడా చెత్త పేరుకుపోయిందని తాగునీరు కూడా లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత చేయాలని, మంజీరా నీటిలో కలుస్తున్న వ్యర్థ నీటిని, డ్రైనేజ్ వ్యర్థాలను వెంటనే తీసివేసి భక్తులకు నీటి సౌకర్యలను కల్పించే విధంగా చర్యలు చేపట్టలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి?.
TTD: తిరుమలలో డ్రోన్ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..!