ప్రస్తుతం మన దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఆ కారణంగా విద్యా సంస్థలు మళ్ళీ మూతపడిపోతాయి అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ… విద్యా సంస్థల మూసివేత క్లారిటీ ఇచ్చారు. ఆయావిడ మాట్లాడుతూ… స్కూల్స్ లో కోవిడ్ కేసులు పెద్దగా నమోదు కావడం లేదు… హాస్టల్స్ లో అక్కడక్కడ నమోదు అయ్యాయి. కేసులు పెరిగితే ప్రభుత్వం ఆలోచించి, సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం పడకుండా చర్యలు ఉంటాయి. కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థులు నష్టపోయారు. కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను నిర్వహిస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పేరెంట్స్ అందరు వాక్సిన్ తీసుకోవాలి అని సూచించారు.
విద్యా సంస్థల మూసివేత… క్లారిటీ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి

Sabitha-Indra-Reddy